#561నీవేయని నమ్మిక
నీవేయని నమ్మికయేసు నాకు.. నీవేయని నమ్మికనీవే మార్గంబు – నీవే సత్యంబునీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే||పెడదారిని బోవగనా మీదికి.. ఇడుమలెన్నియో రాగఅడవిలో బడి నేను – ఆడలుచు నుండగతడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే||కారు మేఘము పట్టగనా మనస్సులో.. కటిక చీకటి పుట్టగఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగతేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే||లేనిపోని మార్గంబులెన్నోయుండ.. జ్ఞానోపదేశంబుమానుగ జేయుచు – వానిని ఖండించినేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు ||నీవే||నరలోకమునుండిపరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండినరులకు ముందుగా – నడుచుచు ముక్తికిసరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు ||నీవే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.