413

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లునీకొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నదినా ప్రాణమా నాసమస్తమా - ప్రభుని స్తుతియించుమానా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా1. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివిక్రీస్తనే బండపైన నన్ను నిలిపితివినా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివినీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే వెంబడింతు ప్రభు2. అంధకారపు లోయలలో నేను నడిచితినీఏ అపాయము రాకుండా నన్ను నడిపితివీకంటి పాపగ నీవు నన్ను కాచితివీకన్న తండ్రివి నీవనీ నిన్న కొలిచెదనుఇలలో నిన్నే కొలిచెదను3. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభుఆత్మఫలములు దండిగా నీకై ఫలియింతునునీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరుత ప్రభునీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతునునే ఇలలో జీవింతును