184

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవాఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)1. నీ తల్లి గర్భాన నీవుండినపుడేనిను చూచే ప్రభు కన్నులు (2)యోచించలేవా ఏ రీతి నిన్నునిర్మించే తన చేతులు (2)2. నీలోనే తాను నివసింపగోరిదినమెల్ల చేజాచెను (2)హృదయంపు తలుపు తెరువంగ లేవాయేసు ప్రవేశింపను (2)3. తన చేతులందు రుధిరంపు ధారల్స్రవియించే నీకోసమే (2)భరియించె శిక్ష నీకోసమేగాఒకసారి గమనించావా (2)4. ప్రభు యేసు నిన్ను సంధించునట్టిసమయంబు యీనాడేగా (2)ఈ చోటనుండి ప్రభు యేసు లేకపోబోకుమో సోదరాఈ చోటనుండి ప్రభు యేసు లేకపోబోకుమో సోదరీ