185

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేనీ దశమా భాగము నీయ వెనుదీతువా – వెనుదీతువా1. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగాపరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా2. పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగావేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా3. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగావెలిగించ ధర పైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా3. కలిగించె సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంబులుబలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా