183

నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా

నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యావిరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా1. తండ్రి ఇంటి నుండి – పిలిచితివి అబ్రామునుఆశీర్వదించితివీ – అబ్రాహాముగా మార్చితివి2. అల యాకోబుని నీవు – విరిచితివి ఆనాడుఆశీర్వదించితివీ – ఇశ్రాయేలుగా మార్చితివి3. హింసకుడు దూషకుడు – హానికరుడైనసౌలును విరిచితివీ – పౌలుగా మార్చితివి