545

నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము

నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలమునీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతమునీ ఆత్మతో నను నింపుమానీ సేవలో ఫలియింపగాదేవా… దేవా… ||నీ దయ||కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగాప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)ఓదార్పువై నా చెంత నీవే ఉండినావునా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయానీవె నా మార్గము – నీవె నా జీవమునీవె నా గమ్యము – నీవె నా సర్వమునా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ||ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివివట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలనినీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతంనీవె నా తోడుగా – నీవె నా నీడగాఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమానా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||