546

నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ దయలో నేనున్న ఇంత కాలంనీ కృపలో దాచినావు గత కాలం (2)నీ దయ లేనిదే నేనేమౌదునో (2)తెలియదయ్యా… ||నీ దయలో||తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలోచేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగానీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునానీ సిలువ నీడలోనే నను దాచియుంచావనినా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావుఅపవాది కోరలకు అంటకుండ దాచావు (2)నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గముఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావునీ పాదాల చెంతనే నే పరవశించాలనినా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||