517

నన్ను గన్నయ్య రావె నా యేసు

నన్ను గన్నయ్య రావె నా యేసునన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||ముందు నీ పాదారవిందములందు నిశ్చల భక్తి ప్రేమను (2)పొందికగా జేయరావే నాడెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||హద్దులేనట్టి దురాశలనవివేకినై కూడి యాడితి (2)మొద్దులతో నింక కూటమివద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||కాలము పెక్కు గతించెనుగర్వాదు లెడదెగవాయెను (2)ఈ లోకమాయ సుఖేచ్ఛలుచాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||దారుణ సంసార వారధిదరి జూపి ప్రోవ నీ కన్నను (2)కారణ గురువు లింకెవ్వరులేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||నా వంటి దుష్కర్మ జీవినికేవలమగు నీదు పేర్మిని (2)దీవించి రక్షింపనిప్పుడేరావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||