518

నన్ను దిద్దుము చిన్న ప్రాయము

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనానీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనానేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను||మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనానేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనానా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనానీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనానీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను||ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనానీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను||శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనాయెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను||వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనానీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||