519

నన్నెంతగా ప్రేమించితివో

నన్నెంతగా ప్రేమించితివోనిన్నంతగా దూషించితినోనన్నెంతగా నీవెరిగితివోనిన్నంతగా నే మరచితినోగలనా – నే చెప్పగలనాదాయనా – నే దాయగలనా (2)అయ్యా… నా యేసయ్యానాదం – తాళం – రాగంఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివోఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివోఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివోఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివోఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||