516

దేవుని సముఖ జీవ కవిలెలో

దేవుని సముఖ జీవ కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)హత సాక్షుల కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)విజయవీరుల కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)సర్వోన్నతుని పురములలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)ప్రార్ధన వీరుల కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)పరిశుద్ధుల కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||