#515దేవుడు మనకు ఎల్లప్పుడు
దేవుడు మనకు ఎల్లప్పుడు (2)తోడుగ నున్నాడు (3)ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)హానోకు తోడనేగెను (2)దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడుదైవాజ్ఞను శిరసావహించి (2)దివ్యముగ నా బ్రాహాము (2)కన్న కొమరుని ఖండించుటకు (2)ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడుయోసేపు ద్వేషించ బడినపుడు (2)గోతిలో త్రోయబడినపుడు (2)శోధనలో చెరసాలయందు (2)సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడుఎర్ర సముద్రపు తీరమునందు (2)ఫరో తరిమిన దినమందు (2)యోర్దాను దాటిన దినమందు (2)యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడుదావీదు సింహము నెదిరించి (2)ధైర్యాన చీల్చినయపుడు (2)గొల్యాతును హతమార్చినయపుడు (2)సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడుసింహపు బోనులో దానియేలు (2)షద్రకు మేషా కబేద్నెగో (2)అగ్ని గుండములో వేయబడెన్ (2)నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడుపౌలు బంధించబడినపుడు (2)పేతురు చెరలో నున్నపుడు (2)అపోస్తలులు విశ్వాసులు (2)హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.