#514దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము
దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువనీ ఆత్మతో నింపుమా (2) ||దేవా||కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకుమాకేమి భయము – మాకేమి దిగులునీకే వందనములయ్యాలోబడి జీవింతుము – లోపంబులు సవరించుములోకాశలు వీడి – లోకంబులోననీ మందగా ఉందుము ||దేవా||సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్మునెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సుఇమ్మహిలో మాకిమ్మయ్యాఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవముఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగామమ్ములను బలపరచుము ||దేవా||ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలనులోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండాదాచుము నీ చేతులలోఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలిఫల సంపదలతోను – కలకాలము జీవించకురుపించుము నీ దీవెనలన్ ||దేవా||పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతోసంతసంబుగ సాగెదమువింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుముకొంత కాలమే మేము – ఉందుము లోకానచెంత చేరగ కోరెదమునీ చెంత చేరగ కోరెదము ||దేవా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.