#155నడిపించు నా నావ – నడి సంద్రమున దేవ
నడిపించు నా నావ – నడి సంద్రమున దేవనవ జీవన మార్గమున – నా జన్మ తరియింప1. నా జీవిత తీరమున – నా అపజయ భారమున నలిగినా నా హృదయమును – నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయ – నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము – నా సేవ జేకొనుము2. ఆత్మార్పణ చేయకయే – ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే – అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే – ఆవేదనేదురాయే ఆధ్యాత్మిక లేమిగని – అల్లాడే నా వలలు3. ప్రభు మార్గము విడచితిని – ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని – పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో – ప్రావిణ్యమును బొంది ఫల హీనుడనై యిపుడు – పాటింతు నీ మాట4. లోతైన జలములలో – లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి – లోపంబులు సవరించి లోనున్న ఈవులలో – లోతైన నా బ్రతుకు లోపించని యర్పణగా – లోకేశ చేయుమయా5. ప్రభు యేసుని శిష్యుడనై – ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో – పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో – పరిపూర్ణ సమర్పణతోప్రాణంబును ప్రభు కొరకు – పానార్పణము జేతు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.