173

నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ

నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీనావన్ని కృపచేత నీవలన నొందిన (2)భావంబునను నేను బహుదైర్యమొందెద1. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)నిత్యంబు గరముల నీ సేవ జేసెద3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)ఆశచే నడిపించు మరల నా పదములు4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2)యావంత యైనను నాశింప మదిలోన6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2)సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2)మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2)పదిలంబుగా దాని బట్టి కాపాడుము