538

నా స్తుతుల పైన నివసించువాడా

నా స్తుతుల పైన నివసించువాడానా అంతరంగికుడా యేసయ్యా (2)నీవు నా పక్షమై యున్నావు గనుకేజయమే జయమే ఎల్లవేళలా జయమే (2)నన్ను నిర్మించిన రీతి తలచగాఎంతో ఆశ్చర్యమేఅది నా ఊహకే వింతైనది (2)ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించిఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల||ద్రాక్షావల్లి అయిన నీలోనేబహుగా వేరు పారగానీతో మధురమైన ఫలములీయనా (2)ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివేవిజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల||నీతో యాత్ర చేయు మార్గములుఎంతో రమ్యమైనవిఅవి నాకెంతో ప్రియమైనవి (2)నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచిపది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా స్తుతుల||