#537నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగానశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట||విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట||ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట||మార్చబడు నాడు మారా మధురముగా (2)పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట||సౌందర్యమయమగు పరమ కానాను (2)నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట||ఆనందమే పరమానందమే (2)కానాను జీవితము నా కానందమే (2) ||నా సంకట||నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2) ||నా సంకట||నా యేసు ప్రభువే నా బలము గానము (2)నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2) ||నా సంకట||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.