164

నా ప్రియుడా యేసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను

నా ప్రియుడా యేసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేనుక్షణమైనా -నే బ్రతుకలేను – (2) నా ప్రియుడా…. ఆ ఆ అ అ –1. నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి (2)నీ చేతి నీడలో నను దాచుకొంటివి (2)2. నీ వాక్కులన్ని వాగ్దానములై – నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి (2)నీ వాగ్దానములు మార్పులేనివి (2)3. ముందెన్నడూ నేను వెళ్ళని – నూతనమైన మార్గములన్నిటిలో (2)నా తోడు నీవై నన్ను నడిపినావు (2)4. సర్వోన్నతుడా సర్వకృపానిధి – సర్వసంపదలు నీలోనే యున్నవి (2)నీవు నా పక్షమై నిలిచి యున్నావు (2)