163

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు1. ఆపద దినములలో – నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2)2. ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2)3. లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2) శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2)4. ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) ఎల్లప్పుడు నే పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2)5. మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2)