524

నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే

నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమేనా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా||నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమేచేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)నీ కృప నాలో అత్యున్నతమైనీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా||చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినాసిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)నిశ్చలమైన రాజ్యము కొరకేఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా||ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనేఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)ఆత్మతో సత్యముతో ఆరాధించుచునే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||