#589మంగళమే యేసునకు
మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)శృంగార ప్రభువునకు (2)క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే||పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)నిరుపమానందునకు (2)నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే||దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)కరుణా సంపన్నునకు (2)జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే||సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)నిత్య స్వయంజీవునకు (2)నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే||యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)సత్య పరంజ్యోతి యగు (2)సార్వభౌమునకు మంగళమే ||మంగళమే||నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)కరుదెంచిన మా పాలి (2)వర రక్షకునకు మంగళమే ||మంగళమే||పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)పరమేశ్వర తనయునకు (2)బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.