#588భీకరుండౌ మా యెహోవా
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరేఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెనుఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ ||ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెనుధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ ||పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తినిబట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ ||మేటి సంగీతంబులపై – మింట నారవ మొందనుజాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ ||మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందనుదిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.