253

మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా

మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావామనసు మలిన మైన నాకై మనిషిగా దిగివచ్చావ (2)నా మదిని కోవెలగా మలుచుకోవయానా హృదిలో రారాజుగా నిలిచిపోవయా (2)1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము (2) మనసు మర్మమెరిగినా మహనీయుడా మనసు మార్చ గలిగినా నిజ దేవుడా (2)2. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను (2) అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిరమనస్సుతో నీదారిలో సాగనీవయ్యా3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసు తో నీ కడ శిరము వంచితి (2) పూర్ణ శాంతి గల వానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా