252

మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

మనకై యేసు మరణించె మన పాపముల కొరకైనిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)1. తృణీకరింపబడె – విసర్జింపబడెను (2)దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను (2)2. మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు (2)మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె (2)3. గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్ (2)అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును (2)4. దౌర్జన్యము నొందెను – బాధింపబడెను (2)తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్ (2)