317

లెక్కించలేని స్తోత్రములు దేవా

లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై (2)1. ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశముభూమిలో కనబడువన్ని ప్రభువా నిన్నే కీర్తించును2. అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచునుభూమిపై నున్నవన్ని దేవా నిన్నే పొగడును3. నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులుఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్