#94కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి
కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారిజిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా1. పనికిరాని పాత్రనని – పారవేయకుమాపొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండసాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రిఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి2. విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరువెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యాపగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యాఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2)పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివిప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.