#96కృపలను తలంచుచు
కృపలను తలంచుచు (2)ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2)1. కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం – (యేసు) (2)2. రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2) నాకు విరోధమై వర్ధిల్లదు యని చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)3. సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2) సతతము తన కృప వెల్లడిచేయ శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)4. హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2) సీయోను నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే – (ఆమెన్) (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.