#491కొనియాడ తరమే నిన్ను
కొనియాడ తరమే నిన్నుకోమల హృదయ – కొనియాడ తరమే నిన్నుతనరారు దినకరు – బెను తారలను మించు (2)ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ||1. కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ||2. సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ||3. విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ||4. దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ||5. నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ||6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.