490

కొంతసేపు కనబడి

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యేఆవిరి వంటిదిరా ఈ జీవితంలోకాన కాదేది శాశ్వతం (2)యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడుమరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు||1. ఎదురౌతారెందరో నీ పయనంలోనిలిచేది ఎందరు నీ అక్కరలో (2)వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే||2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చిఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే||3. నీ శాపం తాను మోసి పాపం తీసిరక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||