492

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చికొన్నట్టి సంఘమునఎవరు చేరెదరో వారే ధన్యులుపరలోకము వారిది (2) ||క్రీస్తేసు||1. అపొస్తలుల బోధను నమ్మిస్థిరపరచబడిన వారే (2)ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడుసంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు||2. పరిశుద్ధులతో సహవాసమునుఎవరు కలిగియుందురో (2)వారే పొందెదరు క్షేమాభివృద్ధిక్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు||3. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారేతన యందు నిలిచెదరు (2)ప్రకటించెదరు ఆయన మరణపునరుత్థానమును వారు (2) ||క్రీస్తేసు||4. పట్టు వదలక సంఘముతో కూడిఎవరు ప్రార్థించెదరో (2)ప్రార్థన ద్వారా సాతాను క్రియలుబంధించెదరు వారే (2) ||క్రీస్తేసు||5. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకుఎవరెదురు చూచెదరో (2)నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరుసర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||