#478కన్నులనెత్తి పైరుల చూడు
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)1. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||2. మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||3. విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||4. మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||5. మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.