#479కమ్మని బహుకమ్మని
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లనితెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2)జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2)యేసు నీ ప్రేమామృతం (2) ||కమ్మని||1. ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితంయేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2)వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) ||కమ్మని||2. నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవనా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2)ఆరాధింతును నిన్ను అనుదినము (2)జీవింతును నీకై అనుక్షణము (2) ||కమ్మని||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.