89

కల్వరి ప్రేమను తలంచునప్పుడు

కల్వరి ప్రేమను తలంచునప్పుడు – కలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు – పగులుచున్నది హృదయం (2)1. గెత్సేమనే అను తోటలో – విలపించుచు ప్రార్ధించు ధ్వనినలువైపులా వినబడుచున్నది – పగులుచున్నవి మా హృదయములుకలుగుచున్నది దుఃఖం2. సిలువపై నలుగ గొట్టిననూ – అనేక నిందలు మోపిననూప్రేమతో వారిని మన్నించుటకై – ప్రార్ధించిన ప్రియ యేసు రాజామమ్మును నడిపించుము3. మమ్మును నీవలె మార్చుటకై – నీ జీవమును ఇచ్చితివి (2)నేలమట్టుకు తగ్గించుకొని – సమర్పించితివి కరములనుమమ్మును నడిపించుము