#503జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభంనా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన||1. నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలునా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేనునా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన||2. నా పూర్వికులందరు ఎప్పుడో గతించారుఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2)నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యానా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2)దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.