502

జాలిగల దైవమా యేసయ్యా

జాలిగల దైవమా యేసయ్యామనసారా స్తుతింతున్‌ స్తోత్రింతునునీవు దేవుడు సర్వశక్తుడు (2)నీ జాలికి హద్దులే లేవునీ ప్రేమకు కొలతలే లేవు (2)అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల||1. నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొనిదుఃఖములను భరించితివే (2)అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు||2. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతనీపైన పడెనే ప్రభూ (2)అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు||3. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివేగాయములచే స్వస్థమైతిమి (2)నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు||