501

చూచుచున్నాము నీ వైపు

చూచుచున్నాము నీ వైపుమా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపుచూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తనుజాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు||1. మేమరులమై యుంటిమిమార్గము వీడి – మేమందరము పోతిమిప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించిక్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు||2. నిను నమ్ము పాపులకువారెవరైనా – నీ శరణు జొచ్చువారలకుఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచుగనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు||3. నీ భయము మాయెదలనునిలుపుము నీదు – ప్రాభవ మొనరంగనునీ భయముచే మేము – వైభవ మొందుచునే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||4. దయ జూచి మము నెప్పుడుమంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడుదయచేయరానివి – దయచేయుమని కోరదయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||