43

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావుఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రమునిన్నే అనుసరింతుము జీవితాంతము1. ఘనులైన వారే గతియించగాధనమున్నవారే మరణించగాఎన్నతగనివారమైన మమ్ము కనికరించావుమా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు2. మా కంట కన్నీరు జారకుండగాఏ కీడు మాదరికి చేరకుండగాకంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావుదుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు3. ఈ లోక యాత్రలో సాక్షులుగానీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగాఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావునీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు