42

ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం

ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితంశరణం నీ చరణం శరణం నీ చరణం1. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండివిలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిఅయినా నీ ప్రేమతో నన్నుదరిచేర్చినావుఅందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం2. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పునీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ముఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ముప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా3. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పుకన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగుక్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యానశియించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా