#656హల్లేలూయా యని పాడి స్తుతింపను
హల్లేలూయా యని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరారారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా||పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.