#657హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతాసిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు||శాంతి సమాధానాధిపతీస్వాంతములో ప్రశాంతనిధీ (2)శాంతి స్వరూపా జీవనదీపా (2)శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||తపములు తరచిన నిన్నెగదాజపములు గొలిచిన నిన్నెగదా (2)విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)సఫలత నీవెగదా ||సిల్వధరా||మతములు వెదకిన నిన్నెకదావ్రతములుగోరిన నిన్నెగదా (2)పతితులు దేవుని సుతులని నేర్పిన (2)హితమతి వీవెగదా ||సిల్వధరా||పలుకులలో నీ శాంతికధతొలకరి వానగా కురిసెగదా (2)మలమల మాడిన మానవ హృదయము (2)కలకలలాడె కదా ||సిల్వధరా||కాననతుల్య సమాజములోహీనత జెందెను మానవత (2)మానవ మైత్రిని సిల్వ పతాకము (2)దానము జేసెగదా ||సిల్వ ధరా||దేవుని బాసిన లోకములోచావుయే కాపురముండె గదా (2)దేవునితో సఖ్యంబును జగతికి (2)యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||పాపము చేసిన స్త్రీని గనిపాపుల కోపము మండె గదా (2)దాపున జేరి పాపిని బ్రోచిన (2)కాపరి వీవెగదా ||సిల్వ ధరా||ఖాళీ సమాధిలో మరణమునుఖైదిగ జేసిన నీవే గదా (2)ఖలమయుడగు సాతానుని గర్వము (2)ఖండనమాయె గదా ||సిల్వ ధరా||కలువరిలో నీ శాంతి సుధాసెలయేరుగ బ్రవహించె గదా (2)కలుష ఎడారిలో కలువలు పూయుట (2)సిలువ విజయము గదా ||సిల్వ ధరా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.