110

గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు

గొఱ్రెల గొప్ప కాపరి నా యేసుమంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు (2)మంచి కాపరి ప్రధాన కాపరి – ప్రేమ కాపరి నిత్య కాపరి (2)1. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకుదారి తప్పిన నన్ను రక్షించుటకు (2)కొండలు కోనలు దాటాడు – లోయలు లోతులు వెదికాడు (2)2. జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడుమబ్బుపట్టి వున్నపుడు గొర్రెల పాకకు నడిపాడు (2)పచ్చిక బయళ్ళో మేపాడు – శాంతి జలములకు నడిపాడు (2)3. ఎండవేళలో నన్ను నీడకు నడిపాడుచీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు (2)ఎన్నడు నన్ను వీడడు – ఎప్పుడు నాతో వుంటాడు (2)