#102గడచిన కాలం కృపలో మమ్ము – కాచిన దేవా నీకే స్తోత్రము
గడచిన కాలం కృపలో మమ్ము – కాచిన దేవా నీకే స్తోత్రముపగలు రేయి కనుపాప వలె – కాచిన దేవా నీకే స్త్రోత్రము (2)మము కాచిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)1. కలత చెందిన కష్టకాలమున – కన్న తండ్రి వై నను ఆదరించినకలుషము నాలో కాన వచ్చిన – కాదనక నను కరుణించిన (2)కరుణించిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)2. లోపములెన్నో దాగి ఉన్ననూ – దాతృత్వములో నను నడిపించినాఅవిధేయతలే ఆవరించినా – దీవెనలెన్నో దయచేసిన (2)దీవించిన దేవా నీకే స్తోత్రము – దయ చూపిన దేవా నీకే స్తోత్రము (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.