#468ఏపాటి దాననయా
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకునేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)నా దోషము భరియించి నా పాపము క్షమియించినను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవికృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి||1. కష్టాల కడలిలో కన్నీటి లోయలలోనా తోడు నిలిచావు నన్నాదరించావు (2)అందరు నను విడచినా నను విడువని యేసయ్యావిడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే||2. నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యానేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యానీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.