456

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా

ఎందుకో దేవా ఇంతటి ప్రేమాఎన్నిక లేని నరుని మీద (2)మమతకు ప్రేమకు అర్హత లేని (2)మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో||1. ఎందుకు పనికిరాని నన్నుఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)ఎంచితివి నీ పుత్రికగా నన్పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో||2. సర్వ పాపముల పరిహారిసర్వ జనులకు ఉపకారి (2)శాపము నొందిన దోషి మీదశాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో||3. నాశ మార్గములో బ్రతికిన నన్నునీతి మార్గముకు పిలిచితివా (2)నిత్యము నీతో యుండుటకుపాపిని నన్ను పిలచితివా ||ఎందుకో||