457

ఎనలేని ప్రేమ నాపైన చూపి

ఎనలేని ప్రేమ నాపైన చూపినీ వారసునిగ చేసినావు (2)నీ ప్రేమ నేను చాటెదన్నా సర్వం నీవే యేసయ్యా (2)1. నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవానీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)నీ కృప చేత రక్షించినావేనీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని||2. తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవైఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)కన్నీరు తుడచి నన్నాదరించినఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||