445

ఈ దినం సదా నా యేసుకే సొంతం

ఈ దినం సదా నా యేసుకే సొంతంనా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)రానున్న కాలము – కలత నివ్వదు (2)నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం||1. ఎడారులు లోయలు ఎదురు నిలచినాఎన్నడెవరు నడువని బాటయైనను (2)వెరవదెన్నడైనను నాదు హృదయము (2)గాయపడిన యేసు పాదం అందు నడచెను (2) ||ఈ దినం||2. ప్రవాహం వోలె శోధకుండు ఎదురు వచ్చినాయుద్ధకేక నా నోట యేసు నామమేవిరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవుయెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||