509

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యాదిగి రానైయున్న మహరాజువు నీవయ్యామొదటివాడవు – కడపటివాడవుయుగయుగములలో ఉన్నవాడవు (2)1. మానక నా యెడల కృప చూపుచున్నావుమారదు నీ ప్రేమ తరతరములకు (2)మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవునీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవునీ మాటలు జీవపు ఊటలునీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||2. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావుదయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావుదీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవునీ దీవెన పరిమళ సువాసననీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు||3. సీయోను శిఖరముపై నను నిలుపుటకేజ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావుసుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావునీ రాజ్యము పరిశుద్ధ నగరముఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||