508

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాఅణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2)ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2)పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు||1. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2)మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు||2. ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2)ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు||3. దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2)ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు||4. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2)సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||