#507త్రాహిమాం క్రీస్తు నాథ
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావేనేను – దేహి యనుచు నీ పాదములేదిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||1. గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనైరవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితిత్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశియివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||2. నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూనిచేయరాని దుష్కర్మములు – చేసినాడనుదయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనులజేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం||3. నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేకదబ్బర లాడుతకు ము – త్తా నైతినిఅబ్బురమైన ఘోర పాపాంధకార కూపమందుదబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం||4. నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవుచున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినావిన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చియన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.