#510దీవించావే సమృద్ధిగా
దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమనిప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమనిదారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా..చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే||1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యానీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యానా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావేనే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే..శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే||2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యాకొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యానా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలాకొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే..పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.